ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 10 October 2013

    బాలయ్య బాబుతో కలిసి నటించబోతున్న పవన్ కళ్యాణ్ అత్త

    బాలయ్య బాబుతో కలిసి నటించబోతున్న పవన్ కళ్యాణ్ అత్త
    ‘అత్తారింటికి దారేది’ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత నదియా లక్ రేసుగుర్రం లా పరుగు పెడుతోంది. ఆమె కాల్ షీట్స్ ఇస్తే చాలు 50 లక్షలు ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ నదియా మాత్రం అన్ని సినిమాలు ఒప్పుకోకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కధలనే ఎంపిక చేసుకుంటోంది. నిత్యామీనన్ అమలా పాల్ లాంటి యంగ్ హీరోయిన్స్ రేటు కన్నా నదియా పారితోషకం ఎక్కువగా ఉంది అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్ధమవుతుంది.

    ఈ పరిస్థుతులలో ఒక లేటెస్ట్ న్యూస్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం నదియా బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న ‘లెజెండ్’ సినిమాలో ఒక ప్రముఖ పాత్రను పోషించడానికి అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కధ ఫ్లాష్ బ్యాక్ లో నదియా పాత్ర బాలకృష్ణతో ఉంటుందట. అయితే నదియా బాలయ్యతో నటించబోయేది అత్తగానా లేకపోతే భార్యగానా అనే విషయం పై క్లారిటీ లేదు అంటున్నారు.

    బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విజయదసమి రోజున విడుదల అవుతుందని తెలుస్తోంది.

    Tollywood

    Bollywood

    Kollywood