ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 13 October 2013

    అత్తారింటికి దారిచెప్పినందుకు ధ‌న్యవాదాలు

    అత్తారింటికి దారిచెప్పినందుకు ధ‌న్యవాదాలు
    అత్తారింటికి దారేది సినిమా పైర‌సీ గొడ‌వ మ‌ధ్య విడుద‌లైనా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. గబ్బర్‌సింగ్ బ్లాక్ బ‌స్టర్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అందిన మ‌రో భారీ హిట్ ఇది. స‌మంత‌, ప్రణీత నాయిక‌లుగా న‌టించారు. త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వం వ‌హించారు.

    ఈ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ అంతా తెలుగు ప్రేక్షకుల‌కు ధ‌న్యవాదాల‌ను చెప్పుకోనుంది. గ‌త ఆదివార‌మే ఈ కార్యక్రమం జ‌ర‌గాల్సింది. కానీ స‌మైక్యాంధ్ర గొడ‌వ‌ల వ‌ల్ల వాయిదా ప‌డింది. కానీ ఈ ఆదివారం త‌ప్పకుండా యూనిట్ మొత్తం పెద్ద వేడుక‌లో పాల్గొన‌డానికి సిద్ధమ‌వుతోంది. శిల్పక‌ళావేదిక ఈ వేడుక‌కు వేదిక కానుంది.

    పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కానుండడంతో వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేయడంతో పవన్ ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేందుతు సిద్ధమౌతున్నాడు. ఈ సక్సెస్ సంబరాల్లో పాల్గొనేందుకు అభిమానులు భారీగా హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood