నేనేమిటో నిరూపించుకునే వరకు బాలీవుడ్ ని వదిలిపెట్టనంటోంది ఇలియానా. పరాజయాలు ఎదురైనా ఈ ముద్దుగుమ్మ వెనక్కి తగ్గడం లేదు. నా అందమే నాకు అవకాశాలు తెచ్చిపెడతాయని ధీమాగా చెబుతోంది. ఆ కాన్ఫిడెన్స్ కి తగ్గట్టుగానీ వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఇదివరకు తాప్సితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వరుణ్ ధావన్ ఇప్పుడు ఇలియానాపై మనసు పడ్డాడు. నా పక్కన ఇలియానా నటించాల్సిందే అని పట్టుబట్టడంతో వీరిద్దరి కలయికలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ తన తనయుడు వరుణ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కించబోతున్నారు. అందులో కథానాయికగా ఇలియానా ని ఎంచుకున్నారు.
వరుణ్ ధావన్ కోరిక మేరకే తన తండ్రి డేవిడ్ ధావన్... ఇలియానాని కథానాయికగా సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఆ మధ్య వరుణ్ ధావన్ `చష్మే బద్దూర్` అనే సినిమాలో నటించాడు. అందులో తాప్సి కథానాయికగా నటించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్యా డేటింగ్ నడిచిందని ప్రచారం సాగింది. ఇప్పుడేమో మనోడు ఇల్లీ బేబీపై ముచ్చటపడుతున్నాడు. వీరి మధ్య కూడా సంతింగ్ సంతింగ్ ఏమైనా మొదలయ్యిందేమో తెలియదు మరీ...