ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 13 October 2013

    'ఎవడు' మీద కర్చీఫ్‌ వేశాడు

    Vijay looking to remake Yevadu, Tamil hero Vijay to remake Ramcharan Yevadu
    రీమేక్‌ రాజాగా పేరున్న తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ ఈమధ్య ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. అప్పట్లో కాస్త తడబడినా కానీ ఇప్పుడు వరుస విజయాలతో టాప్‌లో ఉన్నాడు. ఈ టైమ్‌లో మరో రెండు పెద్ద హిట్స్‌ తన సొంతం అయితే కాంపిటీటర్స్‌కి అందనంత ఎత్తుకి ఎదిగిపోతాడు. అందుకే విజయ్‌ అలాంటి కథల అన్వేషణలో ఉన్నాడు. తెలుగులో వచ్చే ప్రతి పెద్ద సినిమా గురించి వాకబు చేసే విజయ్‌ ఇప్పుడు రామ్‌ చరణ్‌ 'ఎవడు' మీద కన్నేశాడట. ఈ చిత్రం రైట్స్‌ తీసుకోవాల్సింది ఒక ప్రముఖ నిర్మాతకి చెప్పాడని టాక్‌. ఇక్కడ చరణ్‌ చేస్తున్న సినిమాలు తనకి సూట్‌ అవుతాయి కాబట్టి ఎవడు కూడా తనకైతే బాగుంటుందని ఫీలవుతున్నాడట.

    ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ కోసం కేవలం తమిళం నుంచే కాకుండా వివిధ భాషల నుంచి పోటీ పడుతున్నారట. ఈ చిత్రం పంపిణీ హక్కులని కూడా చాలా వరకు అమ్మకుండా పెట్టుకున్న దిల్‌ రాజు రీమేక్‌ రైట్స్‌ కూడా అమ్మట్లేదు. రిలీజ్‌ లేట్‌ అయినా కానీ విడుదలైన తర్వాత ఈచిత్రం సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నాడు. అందుకే రిలీజ్‌ అయిన తర్వాత క్రేజ్‌ ఇంకా ఎక్కువ ఉంటుందని రీమేక్‌ రైట్స్‌ ఎవరికీ ఇవ్వడం లేదు. ఎవడు తమిళంలో రీమేక్‌ అయితే మాత్రం విజయ్‌ హీరోగా నటిస్తాడని కన్‌ఫర్మ్‌ చేసుకోవచ్చు.

    Tollywood

    Bollywood

    Kollywood