ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 11 October 2013

    బ్యాండు మోగించనున్న అందాల బాంబు!

    బ్యాండు మోగించనున్న అందాల బాంబు
    ఇటీవలే వచ్చిన హిట్టు హిందీ సినిమా 'శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌'లో ఓ కథానాయికగా నటించిన వాణీ కపూర్‌ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకి కనువిందు చేయనుంది. నాని హీరోగా రూపొందుతోన్న 'బ్యాండ్‌ బాజా బారాత్‌' రీమేక్‌లో హీరోయిన్‌గా వాణి నటిస్తోంది. హిందీలో ఈ పాత్రని చేసిన అనుష్క శర్మకి చాలా మంచి పేరొచ్చింది. ఎంతో మంది పాపులర్‌ తెలుగు హీరోయిన్లని పరిశీలించిన ఈ పాత్ర చివరకు వాణిని వరించింది.

    యష్‌రాజ్‌ సంస్థ నుంచి పరిచయం అయ్యే ఏ హీరోయిన్‌ అయినా కానీ అందాల ప్రదర్శనకి అడ్డు చెప్పదు. ఎలాంటి అరమరికలు లేకుండా బికినీల్లో సైతం కనిపించడానికి సై అనేస్తుంది. వాణీ కపూర్‌ కూడా నటనలో ఓనమాలు దిద్దకముందే అందాలు ఆరబోయడంలో అం అః లు నేర్చేసుకుంది. యష్‌రాజ్‌ బ్యానర్‌లో మూడు సినిమాలకి ఒప్పందం చేసుకున్న వాణి త్వరలోనే వెండితెరపై తన మెరిసే దేహాన్ని చిట్టి బికినీలో చుట్టి చూపించనుందట. మరి దానికంటే ముందు ఈ అమ్మడు మోగించే బ్యాండుకి తెలుగు, తమిళ యువత ఎంతవరకు మతులు చెడగొట్టేసుకుంటారో చూద్దాం.

    Tollywood

    Bollywood

    Kollywood