దసరా పండగని క్యాష్ చేసుకుని, ఓ భారీ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆశ పడుతున్నాడు. 'రామయ్యా వస్తావయ్యా' బృందం ఈ చిత్రాన్ని ఎలాగైనా దసరాకి విడుదల చేయాలని చూస్తోంది. కానీ సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక పరిస్థితులు ఈ చిత్రానికి అనుకూల వాతావరణం కల్పించడం లేదు.
సీమాంధ్రలో సమైక్యాంధ్రకి మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకి దిగడంతో అక్కడ అంతా చీకటి అలముకుంది. విద్యుత్ లేక పలు రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇది కొనసాగితే అక్కడి పరిస్థితి మరింతగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల థియేటర్లని జనరేటర్లపై నడపాల్సి వస్తుంది. ఈ భారం ఓపలేక కొందరు ఎగ్జిబిటర్లు రోజుకి రెండు లేదా మూడు షోలు మాత్రమే ప్రదర్శించగలమని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాని విడుదల చేసినట్టయితే 'రామయ్య' చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
అత్తారింటికి దారేది రెండవ వారం వసూళ్లపై ఉద్యమ ప్రభావం బాగా పడింది. అయితే అప్పటికే తొలి వారంలో ఈ చిత్రం భారీగా రాబట్టుకోవడం వల్ల బయ్యర్లు అంతగా భయపడడం లేదు. రామయ్యా వస్తావయ్యా మాత్రం ఆదినుంచీ ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఫైనల్‌గా దీనిని విడుదల చేసేస్తారో లేక వాయిదా వేస్తారో చూడాలి.
Search Terms: NTR, Ramayya Vasthavayya, Jr NTR, Attarintiki Daredi, Seemandhra, Samaikyandhra