తనలోని నటుడికి ఎల్లలు లేవని మరోసారి చాటారు ప్రకాష్‌రాజ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్న ప్రకాష్‌రాజ్ త్వరలోనే హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఒకటి కాదు.. ఏకంగా రెండు సినిమాల్లో. రెండూ క్రేజీ ప్రాజెక్టులే. ప్రముఖ రచయిత వికాస్ స్వరూప్ (స్లమ్ డాగ్ మిలియనీర్) రాసిన ఓ కథను త్వరలో హాలీవుడ్ చిత్రంగా రానుంది. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ కీలక పాత్రధారి. అంతేకాదు విశ్వ విఖ్యాత దర్శకుడు స్పీల్‌బర్గ్ రూపొందించే చిత్రంలోనూ ప్రకాష్‌రాజ్ నటిస్తారని సమాచారమ్. ఇది ఇండియా – పాకిస్థాన్ నేపథ్యంగా సాగే కథ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ రెండు చిత్రాల గురించిన పూర్తి సమాచారమ్ తెలుస్తుంది.