పవన్ కల్యాణ్ తన అభిమానులకు దసరా కానుక ఇస్తున్నాడు. అత్తారింటికి దారేది సినిమా విజయోత్సవ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, పండుగ సంబరాలను రెట్టింపు చేశాడు పవన్. ఈ థ్యాంక్యూ ఫంక్షన్ ఈ రోజు సాయిత్రం 6గంటల నుంచి హైదరాబాద్‌లో శిల్పకళావేదికలో జరగనుంది. పవన్ ఫ్యాన్స్ పాసుల కోసం ఎగబడుతున్నారు. కేవలం రెండు వేల పాసులకు మాత్రమే అనుమతి వచ్చింది. ఈ కార్యక్రమానికి పవన్‌తో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొననుంది. దాసరి నారాయణరావు కూడా హాజరవుతారని సమాచారమ్. ఈ వేదికపై పవన్ – త్రివిక్రమ్‌ల కొత్త సినిమా గురించి ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

