ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 15 October 2013

    ఏడేళ్ళ క్రితం రాసుకున్న కథతో...

    Nagarjuna Bhai  Movie Audio Release, Nagarjuna Bhai Movie release, Nagarjuna at Bhai audio Launch
    ఈ ఫీల్డులో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నేనేరా... అంటూ సరికొత్త డైలాగ్ చెబుతున్నాడు నాగార్జున. `భాయ్` సినిమాకోసం ఆయన చేస్తున్న సందడే ఇదంతా. అయితే ఈ సినిమా కథ మాత్రం చాలా పాతదట. ఏడేళ్ళ క్రితంనాటిదట. ఆ విషయాన్ని స్వయంగా నాగార్జునే చెప్పాడు. సోమవారం హైదరాబాద్ లో `భాయ్` పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... ``వీరభద్రం ఏడేళ్ళ క్రితం నన్ను దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేసుకున్న కథ ఇది. చాలా బాగుంది. `హలో బ్రదర్` శైలిలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. దేవిశ్రీప్రసాద్ చక్కటి స్వరాలు సమకూర్చాడు. నా సినిమాలకు తను ఎప్పుడూ మంచి పాటలనే ఇస్తుంటాడు. ఇందులో భాయ్ టైటిల్ సాంగ్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు". `భాయ్` సినిమాలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ నటించింది. వీరభద్రం దర్శకత్వం వహించారు. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

    Tollywood

    Bollywood

    Kollywood