ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 10 October 2013

    మెగాస్టార్ రెడీ అంటే నేనూ రెడీ

    మెగాస్టార్ రెడీ అంటే నేనూ రెడీ
    "చిరంజీవి గారి 150 వ సినిమా కు సంబంధించి ఇప్పటివరకూ చాలా కధలు విన్నాం. కొన్నింటి మీద కసరత్తు చేశాం. కాని ఇంతలో ఆయన రాజకీయంగా బిజీ అయిపొవటంతో అవన్నీ తాత్కాలికంగా పక్కన పెట్టాం. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా మొదలు పెట్టేందుకు సిద్ధం" అన్నారు ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్. తాను సినిమాకూ సినిమాకూ బాగా గ్యాప్ తీసుకుంటానని, అంతా పక్కాగా రెడీ అయినతరువాతనే ప్రాజెక్టు మొదలు పెడతానని వినాయక్ చెప్పారు.

    తనను సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం చేసిన బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా ప్రస్తుతం తాను ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నానని, బహుశా ఈ నెలలోనే ఆ సినిమా మొదలవుతుందని ఆయన తెలిపారు. సాయి శ్రీనివాస్ మీద ఇప్పటికే కొన్ని సన్నివేశాలు ట్రయల్ గా షూట్ చేశామని, అతడిలో పెద్ద హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా వున్నాయని వినాయక్ చెప్పారు.

    తన కుటుంబానికి రాజకీయ నేపధ్యం వుండటం వల్లనే తాను రాజకీయాలలోకి వస్తున్నానన్న వార్తలు వస్తున్నాయని, అయితే తనకు ఇప్పటివరకూ పాలిటిక్స్ లోకి ఆలోచన లేదని, భవిష్యత్తులో అలాంటి ఆలోచన వస్తుందేమో చెప్పలేనని ఆయన అన్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood