ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 10 October 2013

    రామయ్యా వస్తావయ్యా లో సూపర్ సస్పెన్స్

    రామయ్యా వస్తావయ్యా లో సూపర్ సస్పెన్స్
    హరీష్ శంకర్ దర్శకత్వంలో మన బుడ్డోడు జూనియర్ నటించిన ‘రామయ్య’ సినిమాలో జూనియర్ అభిమానులకు షాక్ ఇచ్చేలా ఒక సాంగ్ ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. రేపు విడుదల అవుతున్న ఈ సినిమాలో గతంలో ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ సినిమాలోని ‘నువ్వు విజిలేస్తే ఆంద్రా సోడా బుడ్డి’ అనే పాటను రీమిక్స్ చేసి చిత్రీకరించారని జూనియర్ అభిమానులకు ఆశ్చర్యం కలిగించేలా ఇప్పటిదాకా సీక్రెట్ గా ఉంచి రేపు దియేటర్లలో సినిమాను చూస్తున్న యంగ్ టైగర్ అభిమానులకు జోష్ కలిగించేలా ఈ పాటను ‘రామయ్య’ సినిమాలో పెట్టారని విపరీతమైన ప్రచారం ఫిలింనగర్ లో జరుగుతోంది.

    ఇంతకీ ఈ వార్త నిజమా కాదా అన్న విషయం రేపు తేలిపోతుంది. హరీష్ శంకర్ జూనియర్ తో సినిమా చేస్తున్నాడు అని తెలియగానే చాలా మంది ‘బుడ్డోడు’ తో సినిమా చేస్తున్నావట కదా అంటు మెసేజ్ లు వచ్చేవట. ఆ మెసేజ్ లు చూసి అసహనానికి గురైన హరీష్ శంకర్ కోపం నుండి వచ్చిన డైలాగ్ బుడ్డోడు డైలాగ్ అంటూ హరీష్ ఈరోజు చాలా పత్రికలకు తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అత్యంత భారీ అంచనాలతో రేపు విడుదలవుతున్న ‘రామయ్య’ సినిమా మన జూనియర్ దసరా సెంటిమెంట్ ను ఎంతవరకు నిజం చేస్తుందో చూడాలి మరి...

    Tollywood

    Bollywood

    Kollywood