పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే ‘గబ్బర్ సింగ్-2' చిత్రం తర్వాత పివిపి బేనర్ సినిమా మొదలు కానుంది. ఈ మేరకు నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా పకటించారు. పివిపి సినిమా' సంస్థ తెలుగువాడైన ప్రసాద్ వి పొట్లూరికి చెందినది కావడం గమనార్హం. అయితే పవన్‌తో చేయబోయే సినిమాకు ఏ దర్శకుడు పని చేయబోతున్నారు, ఖరారు కాలేదు. ప్రస్తుతం ఆ సంస్థలో పని చేయడానికి పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మాత్రమే స్పష్టం అవుతోంది.గబ్బర్ సింగ్ 2 తర్వాత. పవన్ కళ్యాణ్ ఏ కథ ఓకే చేసినా, ఏ దర్శకుడిని ఎంపిక చేసినా. ఆ సినిమా నిర్మాణ బాధ్యతను పివిపి సంస్థ తీసుకోనున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా ఆయన పివిపి బ్యానర్ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన అక్షరాలా 18 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలో ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అని ఫిల్మ్ నగర్ సమాచారం శ్రీకాంత్ అడ్డాల..వెళ్లి పవన్ కి కథ చెప్పారు. ఫ్యామిలీ నేపద్యంలో యాక్షన్ తో జరిగే ఆ కథ. పవన్ నచ్చిందని,ఇప్పుడు సమాచారం...