కంగారు పడకండి.. అత్తారింటికి దారేదిలో చిరంజీవి నటించలేదు. కానీ చిరు ప్రస్తావన మాత్రం ఉందట. తన ప్రతి సినిమాలోనూ కనీసం ఒక్కసారి అన్నయ్యను గుర్తు చేయడం ఈ తమ్ముడికి అలవాటే. ఈసారీ అదే పంథాలో వెళ్లాడు. ఓ సందర్భంలో చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఓ సీన్ చూపిస్తారట. అది చూసిన పవన్ `ఈయనెవరు..? ఇంత బాగా నటిస్తున్నారు..?` అని అంటాడట. ఆయన చిరంజీవి అని గొప్ప హీరో, ఇప్పుడు నటించడం లేదు, ఆయన అబ్బాయి నటిస్తున్నాడు..` అని పక్క పాత్ర అంటోందట. మెగా హీరోల సినిమాలో చిరంజీవి ప్రస్తావన వస్తే.. అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. పైగా ఇది పవన్ సినిమా అయె.. ఇక చిరు ఫ్యాన్స్‌ని పట్టుకోగలమా?
Thursday, 26 September 2013
Tollywood