ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 19 November 2013

    గ్యాంబ్లర్ తో ధూమ్ 4

    Ajith in Dhoom 4, అజిత్ తో ధూమ్ 4, ajith as hero in dhoom 4
    యష్ రాజ్ ఫిల్మ్స్ అన్నా.. వాళ్ళ సినిమాలలో ధూమ్ సిరిస్ అన్నా ఇండియన్ ప్రేక్షకులకు మరిచిపోలేని క్రేజ్ ఉంటుంది. ధూమ్.. ధూమ్ 2.. ప్రస్తుతం రానున్న ధూమ్3 అన్నీ భారీ అంచనాలనే అందుకున్నాయి. భారీ వసూళ్ళనే సాధించాయి. అమీర్ ఖాన్.. అభిషేక్.. కత్రినా నటిస్తూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ధూమ్3 సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.

    ఈ సినిమాను క్రిస్‌మ‌స్ కానుక‌న‌గా డిసెంబ‌ర్ 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంకా ధూమ్3 రిలీజ్ కాకముందే ధూమ్4 సినిమా గురించి కథనాలు మొదలయ్యాయి. ధూమ్4 సినిమాలో సౌత్ స్టార్ అజిత్ నటించనున్నాడని బాలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి. స్వతహాగానే బైక్ రేసర్ అయిన అజిత్ అయితే బాగుంటుందని యాష్ రాజ్ సంస్థ భావిస్తుందట.

    అయితే ధూమ్4 లో కేవలం అజిత్ ను మాత్రమే కాకుండా బాలీవుడ్ మరో హీరో కూడా ఉంటాడని.. అభిషేక్.. ఉదయ్ చోప్రాలు కూడా ఉంటారని ఇప్పటి నుండే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ధూమ్3 రిలీజ్ కాగానే ఈ సినిమాను అనౌన్స్ చేయాలని చూస్తున్నారట. అయితే ధూమ్3 సినిమా రిలీజ్ అయితే కానీ ఈ సినిమాపై ఎన్ని అంచనాలుంటాయో అర్ధం కాదు.

    Tollywood

    Bollywood

    Kollywood