ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 19 November 2013

    '1'ను వణికిస్తున్న లీకేజీలు!

    1 ను వణికిస్తున్న లీకేజీలు, One Nenokkadine in Leakage Problems, 1 Nenokkadine in Leakage
    స్టార్ హీరో సినిమా అనగానే ఇప్పుడు లీకుల గొడవ ఎక్కువైపోతుంది. అత్తారింటికి దారేది సినిమా లీక్ తర్వాత షూటింగ్ లో ఉన్న ప్రతి యూనిట్ కూడా సినిమాకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా డైలాగులు.. కొన్ని ఫోటోలు లీకై టెన్షన్ మిగిల్చుతున్నాయి. ముఖ్యంగా మహేష్ 1 సినిమాకు ఈ లీకేజ్ గొడవ ఎక్కువగా ఉంది.

    ఈ సినిమాకు సంబధించిన స్టిల్స్ కొన్ని ఆ మధ్య లీకై సైట్లలో ప్రత్యక్షం కావడంతో అవక్కయిన యూనిట్ కేసు కూడా పెట్టారు. అయితే ఆ లీకులకు మాత్రం కట్టడి పడలేదు. తాజాగా వచ్చిన మహేష్, కృతి సనన్ లపై చేజింగ్ సన్నివేశాల వర్కింగ్ స్టిల్స్ ఇంటర్ నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ ఈ లీకేజ్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చిత్ర యూనిట్ అంటున్నారు.

    ఈ లీకుల పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎలా ఈ స్టిల్స్ బయటకి వచ్చాయి అని దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉండటంతో పైరసీ జరిగితే నష్టాలు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా యూనిట్ లోని సభ్యులు చేస్తున్నారా లేక అసలు ఈ లీకుల కోసం బృందం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

    Tollywood

    Bollywood

    Kollywood