ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 24 November 2013

    నాతో చేయాలంటే...వాళ్ళకే దడ

    నాతో చేయాలంటే...వాళ్ళకే దడ
    సినిమా పరిశ్రమ ఓ ఉచ్చు లాంటిది. ఏ టైమ్‌లో ఎవరి మెడకు ఎలా ఉచ్చు వేస్తుందో ఎవరికీ తెలీదు. ఇప్పటికే ఎందరో తారలు అసాధారణ కారణాలతో బుక్కయిపోయారు. ఓసారి ఇక్కడ చెడ్డపేరు వచ్చిందంటే చాలు ఎవరూ ఆ వైపు కన్నెత్తి చూడరు. పలకరించడానికి అస్సలు సాహసించరు. ఎంత సన్నిహితులైనా దూరం పెట్టేస్తారు. ఇటీవల కొందరు నటీమణులు సెక్స్‌ రాకెట్‌లో దొరికిపోయాక ఇలాంటి వెలివేతకే గురై తీవ్ర మానోవ్యధని అనుభవించారు. అయితే బాలీవుడ్‌లో సన్నిలియోన్‌ పరిస్థితి వీటన్నిటికీ అతీతం. ఆమె పోర్న్‌స్టార్‌ అని అందరికీ తెలుసు.

    తనకున్న గ్లామర్‌, ఛరిష్మాతోనే ఉత్తరాదిన అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. అయితే ఈ భామకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయట.వాటిని ఇటీవల మీడియా ముందు పూసగుచ్చింది. నేను ఓ పోర్న్‌స్టార్‌ అని అంతా భయపడుతున్నారు. నాతో నటించాలంటే ఎవరైనా పెళ్లయినవాళ్లు ముందు పెళ్లాం అనుమతి తీసుకుంటున్నారు. దర్శకులు సైతం నాతో.. అంటే ఆలోచించుకుంటున్నారు. నాతో నటించాలని ఆసక్తి ఉన్నా ఎవరూ దాన్ని నేరుగా చెప్పరు. లోలోన మదనపడుతారు అంటూ వాపోయింది.

    అంతేకాదు తనని ఇష్టపడే వాళ్లు కూడా ఆ ఇష్టాన్ని చెప్పడానికి సంకోచిస్తున్నారు. తమకున్న ఇమేజ్‌ ఏమైపోతుందో అని భయపడి చస్తున్నారు..... అంటూ ఎన్నో విషయాల్ని బాహటంగా చెప్పేసింది సన్ని. రామ్‌గోపాల్‌ వర్మ లాంటి చలనంలేని మనిషికి ఇవేం పట్టవు. అలాంటి వ్యక్తితో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నా. నాతో చేస్తానని కూడా అన్నారాయన.. అంటూ చెప్పుకొచ్చింది.

    Tollywood

    Bollywood

    Kollywood