ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 24 November 2013

    ఐటెమ్‌బాయ్‌గా మారిపోయిన సోనూసూద్‌

    ఐటెమ్‌బాయ్‌గా మారిపోయిన సోనూసూద్‌
    ఐటెమ్ గ‌ర్ల్ అన్న మాట వినిపించ‌గానే… రెండు క‌ళ్లు పెద్ద‌వి చేసుకొని తెర‌పైకేసి చూస్తుంటాం. ముద్దుగుమ్మ‌లు ఆర‌బోసే అందాల‌ను త‌నివి తీరా ఆస్వాదిస్తాం. మ‌రి ఐటెమ్ గ‌ర్ల్ త‌ర‌హాలో… ఐటెమ్ బాయ్ అనే మాట‌ని ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు బాలీవుడ్‌లో ఆ బిరుదును సొంతం చేసుకొన్నాడు… సోనూసూద్‌.

    కండలు పెంచిన ఈ బ్యాడ్‌బాయ్ ఇటీవ‌ల ఎక్కువ‌గా ఐటెమ్ గీతాల్లో క‌నిపిస్తున్నాడ‌ట‌ సోనూసూద్‌. ‘ద‌బాంగ్‌’లో మున్నీకి బ‌ద్నామ్ హుయి… పాట నుంచి మొద‌లుపెడితే – ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ప‌లు చిత్రాల్లో సోనూ ఐటెమ్‌భామ‌ల‌తో క‌లిసి స్టెప్పులేశాడు. తాజాగా ఆయ‌న ‘ర్యాంబో రాజ్‌కుమార్‌’ చిత్రంలోనూ ఓ ఐటెమ్‌గీతం చేశాడ‌ట‌. అందులో సోనూసూద్ మ‌రింత అల్ల‌రి చేశాడ‌ట‌. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ఇది. సోనూ కోసం ప్ర‌భుదేవా ప్ర‌త్యేక‌మైన నృత్యాలు డిజైన్ చేయించిన‌ట్టు స‌మాచారం.

    ఆ విష‌యంపై సోనూసూద్ మాట్లాడుతూ… “ఐటెమ్‌బాయ్ అనిపించుకోవ‌డం కొత్త‌గా ఉంది. ఇలాంటి పాట‌ల్లో న‌టించ‌డం భిన్న‌మైన అనుభ‌వం. ‘ర్యాంబో రాజ్‌కుమార్‌`లో పాట అంద‌రినీ ఆక‌ట్టుకొనేలా ఉంటుంది. షాహిద్ క‌పూర్ మంచి డ్యాన్స‌ర్‌. త‌నతో క‌లిసి డ్యాన్స్ చేశాను. ఈ చిత్రంకోసం ప్ర‌భుదేవాతో క‌లిసి ప‌నిచేయ‌డం ఎప్ప‌టికి మ‌రిచిపోలేను” అని చెప్పుకొచ్చారు.

    Tollywood

    Bollywood

    Kollywood