ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 14 November 2013

    ప‌వ‌న్ స‌హాయం మ‌రోసారి తెలిసింది

    Pawan Kalyan Helps KPHB Girl
    ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా సంద‌ర్భాల్లో ఎంతో మందికి స‌హాయం చేశాడు. కొన్ని తెలిసిన‌వి ఉంటే, కొన్ని ఇప్పటికీ తెలియ‌ని ఉంటాయి. ప‌వ‌న్ ఎంత సంపాదించుకున్నాడో అందులో సగం పైగా సామాజిక సేవ‌ల‌కు ఉప‌యోగిస్తుంటాడు. ఒక్కోసారి ఆ స్థాయికి మించి కూడ స‌హాయాన్ని చేస్తుంటాడు.

    అదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీసెంట్‌గా ఓ బాలిక ఆనారోగ్య స‌మ‌స్యతో బాధ‌ప‌డుతుంటే ఆమెను ఆదుకున్నాడు.   ఇది జ‌రిగి రోజులు గ‌డుస్తున్నా, ఇప్పుడు ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్‌, కె.పి.హెచ్‌.బి లోని ఓ బాలిక, కిడ్నీ సంబంధిత స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతుంది. ఈ విష‌యాన్ని ఈ బాలిక పేరెంట్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గర‌కు తీసుకువెళ్ళారు. వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించి త‌న కారులోనే సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడే ఆ పాప‌ను చూసి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త‌న చారిటి త‌రుపు నుండి రెండు ల‌క్షల రూపాయ‌ల చెక్‌ను ఇచ్చి ఆదుకున్నాడు.

    ఆ విష‌యాన్ని ఆ బాలిక త‌ల్లితండ్రులే మీడియాకు వివ‌రించారు. ప‌వ‌ర్‌స్టార్ రియ‌ల్ లైఫ్‌లోనూ ఓ మ‌నిషిగా ఉంటాడు, మ‌నిషిగానే ఆలోచిస్తాడు అనేది మ‌రోసారి నిరూపిత‌మైంది.   ప్రస్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బర్‌సింగ్‌2 మూవీకు సంబంధించిన ప‌నుల్లో బిజిగా ఉన్నాడు. అత్తారింటికిదారేది బ్లాక్‌బ‌స్టర్ మూవీ త‌రువాత తెర‌కెక్కుతున్న మూవీ గ‌బ్బర్‌సింగ్ కావడంతో ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ అబిమానుల్లో ఉన్నాయి. అందుకే గ‌బ్బర్‌సింగ్‌2 మూవీ ప్రధాన‌ పాత్రల ఎంపిక‌లోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటున్నాడు.

    Tollywood

    Bollywood

    Kollywood