ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 14 November 2013

    హైదరాబాద్ పై నిర్ణయం ఖరారు

    హైదరాబాద్ పై నిర్ణయం ఖరారు
    రాష్ట్ర విభజన విషయంలో పెద్ద పీఠముడిగా మారిన హైదరాబాద్ పై కేంద్రం నిర్ణయం తీసుకుందన్న వార్తలు వినపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని రేపు పార్లమెంట్ లో మద్దతు చెప్పాల్సిన బిజేపికి, అభ్యంతరం చెప్పకుండా ఉండేందుకు తెలంగాణ కాంగ్రెస్ కు సమాచారం అందించారట. హైదరాబాద్ పై అటు సీమాంద్రలోను, ఇటు తెలంగాణలోను వ్యతిరేకత రాకుండా ఉండేలా దానిని అటూఇటూ చేస్తూ ఓ డిసిషన్ తీసుకుంది మంత్రుల బృందం.

    అంతే కాదు సమన్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్న బిజేపిని కూడా తృప్తి పరచేందుకు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగానే ఉంచుతూ కొన్ని కీలక అధికారాలు కేంద్రం పరిదిలోకి తెస్తూ సెమీ యూటిగా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదన వివరాలు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో పాటు పలువురు తెలంగాణ కీలకనేతలకు, బిజేపి పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ కు జిఓఓం అందచేసిందంటున్నారు. పూర్తి అధికారం కేంద్రం పరిదిలోకి తెస్తే తెలంగాణ వారు ఎట్టి పరిస్తితుల్లో ఒప్పుకోరు.

    అందుకే హైదరాబాద్ లోని శాంతి భద్రతలు, భూమి, విద్య వంటి వాటిని కేంద్రం తన పరిధిలో ఉంచుకుంటుంది. కారణం సీమాంద్రులు ప్రధానంగా వ్యక్తం చేస్తున్న భయాలు ఇవే, ఒకటి హైదరాబాద్ లోని సీమాంద్రుల రక్షణ, రెండోది సీమాంద్రులు ఎందరో ఇక్కడ భూములు కొనుక్కొని స్థిర నివాసాలు, వ్యాపారాలు చేస్తున్నారు. వీటిని కూడా ఎక్కడ లాక్కుంటారో, దీనిపై ఎలాంటి చట్టాలు చేస్తారో అన్న భయం సాధారణ సీమాంద్రుల్లో కంటే పేరు మోసిన బడా వ్యాపారులు, లీడర్లకే నెలకొంది. అందుకే దీనిని కూడా కేంద్రం పరిదిలోకి తీసుకుంటున్నారు. మరో ముఖ్యమైనది విద్య. విద్యావకాశాలు కోల్పోతామనే కదా లక్షల సంఖ్యలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇది కూడా కేంద్రం పరిదిలో ఉంటే సీమాంద్రులు చల్లబడతారు. ఈ మూడు మినహా పరిపాలన అంతా తెలంగాణ చేతిలోనే ఉంటుంది కాబట్టి తెలంగాణ వాదులు కూడా దీనికి ఒప్పుకుంటారన్న భావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

    Tollywood

    Bollywood

    Kollywood