పొలిస్... అంటూ స్టైల్ గా పలికి మాస్ ప్రేక్షకులకు వినోదాలు పంచాడు మహేష్. `దూకుడు`లో మహేష్ పోషించిన ఐపీయస్ అజయ్ పాత్ర అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మహేష్ ని ఓ పోలీస్ పాత్రలో అదీ.. ఇదివరకు ఎప్పుడూ లేనంత కొత్తగా చూసుకున్నారు ప్రేక్షకులు. అందుకే ఆ వేషాన్ని అలాగే కంటిన్యూ చేయించేందుకు సిద్ధమయ్యాడు శ్రీను వైట్ల. `దూకుడు` తర్వాత ఆయన మహేష్ బాబుతో `ఆగడు` తీస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మహేష్ పోలీస్ గానే కనిపించబోతున్నాడట.
అయితే ఈసారి ఆయన తెరపై ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ పాత్రలో మహేష్ రాయలసీమ యాస మాట్లాడేలా స్క్రిప్ట్ తయారు చేశారట. `దూకుడు`లో మాత్రం మహేష్ తెలంగాణా యాస మాట్లాడి అదరగొట్టారు. కొత్త టీం తో కూర్చుని శ్రీను వైట్ల స్క్రిప్ట్ ని పకడ్బందీగా సిద్ధం చేశారట. సినిమాని ఈ నెల 28 నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు తాజా సమాచారం.