ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 14 November 2013

    బాహుబ‌లి స్టోరి పూర్తిగా లీకయ్యింది

    బాహుబ‌లి స్టోరి పూర్తిగా లీకయ్యింది
    రాజ‌మౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న మూవీ బాహుబ‌లి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఇప్పటి వ‌ర‌కూ నిర్మించ‌ని భారీ బ‌డ్జెట్‌ ఫిల్మ్‌గా ఇది తెర‌కెక్కుతుంది. అలాగే సౌత్ ఫిల్మ్స్‌లోనూ క్రేజీ ప్రాజెక్ట్‌గా బాహుబ‌లి మూవీ పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీకు సంబంధించిన స్టోరీ లీక్డ్ అంటూ టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.  

    అత్తారింటికిదారేది లీక్డ్ మూవీ వ్వవ‌హారం త‌రువాత రాజ‌మౌళి బాహుబ‌లి మూవీకు సంబంధించిన కంటెంట్ వ్వవ‌హారంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ప్రభాస్ ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్‌లోనూ, లోకెష‌న్స్‌లోనూ ఫోటోలు తీయ‌రాదు, ఫోన్స్ వాడ‌రాదు అంటూ కొన్ని బోర్డుల‌ను చూపించాడు. వీటిని చూస్తే చాలు, బాహుబ‌లి మూవీ కోసం రాజ‌మౌళి ఎంత జాగ్రత్త ప‌డుతున్నాడో తెలుస్తుంది. ఇంత‌లా జాగ్రత్త ప‌డుతున్నా బాహుబ‌లి మూవీ స్టోరి ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్లో తెలిసిపోయింది. ఈ విష‌యం తెలుసున్న అభిమానులు కూడ ఆ స్టోరి ఏంటో తెలుసుకోవటానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  

    ఇంత‌కీ బ‌య‌ట‌కు తెలిసిన క‌థ ఏంటంటే, ప్రభాస్‌,రానా ఇద్దరూ ఓ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తారు. ఫైన‌ల్‌గా త‌న కోసం ఆధిప‌త్యాన్ని రాజ‌నీతితో ఎదుర్కొనేందుకు యుద్దాలు జ‌రుగుతుంటాయి. ఇందులో రానా అడ్డదారిలో హీరోయిన్ అనుష్కను చేజిక్కించుకోవాల‌ని చూస్తుంటాడు. ఇదే బాహుబ‌లి మొత్తం స్టోరి. విన‌టానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికి దీనిని రాజ‌మౌళి ఏ విధంగా తెర‌క్కిస్తున్నాడో అనేదే అస‌లైన క్యూరియాసిటి అని విన్న వాళ్ళు కూడ స్టోరి చాలా ఇంట్రెస్టింగ్ అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood