ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 21 November 2013

    టాలీవుడ్ జంట ట్యాంక్‌బండ్‌పై పబ్లిక్ రొమాన్స్!

    టాలీవుడ్ జంట ట్యాంక్‌బండ్‌పై పబ్లిక్ రొమాన్స్!
    పాపం.. సినిమా వాళ్ళకు అసలు బొత్తిగా ప్రైవసీ అనేది లేకుండా పోతుంది. హైదరాబాద్ లో ఎవరిని అడిగినా ట్యాంక్‌బండ్‌ గురించి చాలా చెబుతారు. ఇక లవర్స్ అయితే అక్కడ గడిపిన క్షణాలను నెమరువేసుకొని సిగ్గుపడతారు. అలాంటి స్పాట్ లో ఓ సినిమా జంట ప్రేమ పాఠాలు నేర్చుకుంటుంటే మాత్రం అది పెద్ద సెన్సేషన్ అయి కూర్చుంది. అవును నిజమండీ బాబు.. రాత్రి 1.30 సమయంలో ఓ ప్రేమ జంట పోలీసుల కంటిలో పడింది.

    బయటతిరిగితే జనాలు గుర్తు పట్టేస్తారనుకున్న ఈ జంట.. కారులో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ట్యాంక్‌బండ్‌ చుట్టూ షికారు చేశారట. ఎలాగూ అర్ధరాత్రి సమయం కావడంతో కారాపిన ఆ యువజంట కారులో పెదవులకు పనిచెప్పారట. అయితే మన పెట్రోలింగ్‌ పోలీసు మామలు ఊరికే ఎందుకు ఉంటారు చెప్పండి. వచ్చి కార్ విండో కొడితే ఇంకేముంది టాలీవుడ్ యంగ్ కపుల్. అయితే పోలీసులు ఈ విషయాన్ని లైట్ గానే తీసుకొని కాస్త చివాట్లు పెట్టి పంపించేశారు.

    ఆ సమయంలో పోలీసులు ఒక్కరే ఉంటారా.. ఒకరో ఇద్దరో సామాన్య జనం కూడా ఉంటారు కదా! ఈ విషయం ఫిల్మ్ నగర్ లో తెలియడంతో ఇప్పుడు ఆ యువ జంట ఎవరా అని ఆరాతీసే పనిలో ఉన్నారు. అయితే ఆ కుర్ర హీరో ఎవరో తెలియదు కానీ అమ్మడు మాత్రం ఈ మధ్య ఇండస్ట్రీ తలుపు తట్టిందని అందుకే ఇంకా ఈ ట్యాంక్‌బండ్‌ వ్యవహారాలు మానుకోలేకపోతుందని ఫిల్మ్ నగర్ లో జోకులేసుకుంటున్నారు. చూద్దాం ఇంకో నాలుగు రోజులు ఆగితే ఆ జంట ఎవరో అదే బయటపడుతుంది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి...

    Tollywood

    Bollywood

    Kollywood