ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 21 November 2013

    శ్రుతి హసన్ పై ఎటాక్ వెనుక నిజాలు...

    శ్రుతి హసన్ పై ఎటాక్ వెనుక నిజాలు...
    గుర్తుతెలియని దుండగుడు ఒకడు సినీనటి శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబడేందుకుయత్నించడం,  ఆమె ప్రతిఘటించడంతో ఆ ఆగంతకుడు పరారవ్వడం మీకు తెలిసిందే. అసలు శ్రుతి ఒంటరిగా ఎందుకు ఉంటుంది? శ్రుతికి తోడుగా ఎవరు ఎందుకు ఉండటం లేదు? తండ్రి కమల్ హసన్ దూరమైనా తర్వాత తల్లి కూడా కూడా దురమైందా? అంటే శ్రుతి ముంబై లో షూటింగ్ కోసం ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవంతి ఆరో అంతస్తులో ఉన్న ఫ్లాట్ లో ఉంటుంది. బయట హోటల్స్ లో ఉండటం కన్నా ఫ్లాట్ లో అయితే సేఫ్ గా ఉండొచ్చు అనుకొంది.

    అసలు ఆ రోజు ఏం జరిగిందంటే శ్రుతి ఇంటికి ఉదయం 9.30కు వచ్చిన ఆగంతకుడు తొలుత కాలింగ్‌బెల్ మోగించాడు. శ్రుతి తలుపు తీసింది. ఎవరు నువ్వు ప్రశ్నించింది. అలా అడిగే సరికి ‘నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు?’ అని దుండగుడు ఆమెను ఎదురు ప్రశ్నించాడు. దీనికి శ్రుతి ‘నువ్వెవరో నాకు తెలియదు’ అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతుపట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శ్రుతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది. సమాచారాన్ని తన మేనేజర్కు తెలియచేసింది.

    శ్రుతి హసన్ పైన ఎటాక్ చేసిన ఆగంతకుడు ఎవరో తెలిస్తే... మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ అగంతకుడు ఇంతకు ముందు కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడట. అతని పేరు కొప్పుల రాజేష్ అని తెలుస్తుంది. ఆ టైం నుండే శ్రుతిని దగ్గరగా చూడటం, ఫాలో అవ్వటం... చేస్తున్నాడట. దానిని ఏ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు శ్రుతి హసన్. తను ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతాడట. ఇదంతా రెండు మూడు సంవత్సరాల నుండి జరుగుతోందట. తను ఎక్కడ షూటింగ్ చేసిన వెళ్లి కంగ్రాట్స్ చెప్తుంటాడు... తనని పెళ్లి చేసుకోమని అనే వాడట. అయతే ఇదంతా కేవలం  సరదాగా అందరు ఫాన్స్ లానే అంటున్నాడు అని బ్రమపడ్డ శ్రుతి హసన్ తను ఎంత తప్పుగా ఆలోచించాడో  ఇప్పుడు అర్ధం అయింది అంటుంది శ్రుతి.

    అంత పెద్ద సెలబ్రిటీ సెక్యూరిటీ ఏ ఇలా ఉంటె మిగితా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అందరు ప్రశ్నిస్తున్నారు. దాడి చేసిన ఆగంతకుడు శ్రుతి నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్కు కూడా రావడం జరిగిందట. ఈ సినిమా నుండే మరి ఎక్కువగా ఫాలో అవ్వడం జరిగిందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

    Tollywood

    Bollywood

    Kollywood