ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Friday, 29 November 2013

పవన్‌ దర్శకుడి తికమక మకతిక

Pawan Director in Confusion, Sampath Nandi Gabbarsingh 2, Heroine for Pawan kalyan Gabbarsingh 2
అసలే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో సినిమా. కాబట్టి కాస్త జాగ్రత్తగా హ్యాండిల్‌ చెయ్యాలి. పైగా ఈసారి కథ కూడా ఆయనే హ్యాండిల్‌ చేశారు కాబట్టి, మన దర్శకత్వం చాలా అద్భుతంగా చెయ్యాలి అనుకుంటున్నాడట సంపత్‌ నంది. రచ్చ సినిమా తరువాత మనోడు రూపొందిస్తున్న సినిమా ‘గబ్బర్‌ సింగ్‌ 2’. ఇంత పెద్ద ప్రాజెక్టు చేస్తూనే మనోడు కాస్త తికమకగా మకతికగా వ్యవహరిస్తున్నాడట. అయితే ఇది సినిమా విషయంలో కాదుకాని, నటీనటుల ఎంపిక విషయంలో జరుగుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

ఇంతవరకు గబ్బర్‌ సింగ్‌ 2, గబ్బర్‌ ప్రక్కన చిందేసే ఆ భాగ్యలక్ష్మి ఎవరో, ఆ భాగ్యం ఎవరికుందో ఫైనల్‌ కాలేదు. అయితే హీరో పవన్‌, ఆయన స్నేహితుడు, నిర్మాత శరత్‌ మరార్‌ మొదలగు వారికి పలానా అమ్మాయి ఐతే బావుంటుంది అని ఒక క్లారిటీ ఉందట. కాని సంపత్‌ మాత్రం ఎందుకో ఒక్కమ్మాయి పేరు కూడా చెప్పలేక తికమక పడుతున్నాడట. ఎందుకంటే, తన తొలిసినిమా ‘ఏమైంది ఈవేళ’కు క్రేజీ కాంబినేషన్‌గా ఉంటుందని, మార్కెటింగ్‌కు ఉపయోగపడుతుందని కాజల్‌ చెల్లి నిషా అగర్వాల్‌ను తీసుకున్నాడు. రచ్చ సినిమాకైతే డేట్స్‌ ఉన్నాయి కాబట్టి మెగా టీమ్‌ తమన్నాతో చెయ్యమంది, మనోడు చేసేశాడు. మరి ఇప్పుడు సొంతంగా ఒక పేరు చెప్పమంటే ఎలా చెబుతాడు? అందుకే తికమక, మకతిక!!

Post Comments

No comments:

Post a Comment