ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 27 November 2013

    ముప్పై కోట్లు ప‌లికిన… 'విక్ర‌మసింహ‌'!!

    ముప్పై కోట్లు ప‌లికిన… విక్ర‌మసింహ‌
    ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘కోచ్చ‌డ‌యాన్‌’. ఆయ‌న కుమార్తె సౌంద‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుమారు వంద కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో రూపొందిన భారీ చిత్ర‌మిది. ‘అవ‌తార్‌’ త‌ర‌హాలో మోష‌న్ కేప్చర్ టెక్నాల‌జీతో రూపొందించారు. తెలుగులో ‘విక్ర‌మ సింహ‌’ పేరుతో విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

    తెలుగు హ‌క్కుల‌ను ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ఫిలింస్ సంస్థ ముప్పై కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసిన‌ట్టు తెలిసింది. ఈనెల 24న తెలుగులో పాట‌ల‌ను విడుద‌ల చేస్తారు. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ ఐదు నుంచి ప‌దినిమిషాల వ‌ర‌కు లైవ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. మిగిలిన పార్ట్ అంతా యానిమేష‌న్ రూపంలోనే ద‌ర్శ‌న‌మిస్తారు. ప‌లు దేశాల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ సినిమాకోసం చిత్ర‌బృందం క‌ష్ట‌ప‌డుతోంది. మ‌రి ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి.

    No comments:

    Post a Comment

    Tollywood

    Bollywood

    Kollywood