ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 27 November 2013

    'హార్ట్ ఎటాక్' ఫ‌స్ట్ లుక్… చాలా హాట్ గురూ!

    'హార్ట్ ఎటాక్' ఫ‌స్ట్ లుక్… చాలా హాట్ గురూ!
    పూరి ‘హార్ట్ ఎటాక్‌’ సంద‌డి మొద‌ల‌వ్వ‌బోతోంది. ఆయ‌న స్వ‌యంగా నిర్మిస్తూ తెర‌కెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలోకి దిగ‌బోతోంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి చేశాడు. వ‌చ్చే నెల‌లో పాట‌లని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌డు ఆ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ బ‌య‌టికొచ్చింది. అది భ‌లే హాట్‌గా క‌నిపిస్తోంది.

    హార్ట్ ఎటాక్ ఫస్ట్ లుక్ లోని బొమ్మ చూస్తుంటే… ఇందులో లిప్ టు లిప్ కిస్సులు బోలెడ‌న్ని ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. పైగా ఆ పోస్ట‌ర్‌పై ‘నాకు ఒక గంట ముద్దు కావాలి, మూడు వేల కాల‌రీలు ఖర్చ‌వ్వాలి’ అంటూ రాసుంది. దీన్నిబ‌ట్టి పూరి ఈ సినిమాని ఎంత ఘాటుగా తెర‌కెక్కించుంటాడో అర్థ‌మ‌వుతోంది.

    ఇందులో నితిన్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ ఆదాశ‌ర్మ క‌థానాయిక‌గా న‌టించింది. పూరి జ‌గ‌న్నాథ్ సినిమాలో డైలాగులు చాలా వ‌ర‌కు ఫిల్ట‌ర్ లేకుండా ఉంటాయి. మ‌రి ఇందులో ఆయ‌న పెన్ను ప‌వ‌ర్ ఎంతో చూడాలి. ఈ సినిమాకి ప్రమోష‌న్ కూడా కొత్త త‌ర‌హాలో చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

    No comments:

    Post a Comment

    Tollywood

    Bollywood

    Kollywood