ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 18 November 2013

    అక్క సినిమా చెల్లికి నచ్చలేదట

    అక్క సినిమా చెల్లికి నచ్చలేదట
    ఎవరికైనా గానీ తమ ఇంట్లోవాళ్లే మొదటి విమర్శకులవుతారు. చేసేవారికి అన్నీ బాగానే అనిపిస్తాయి కాబట్టి అమ్మో, నాన్నో, అక్కో , చెల్లో మంచి చెడులను బేరీజు వేసి చెబుతుంటే వాళ్లు తమ దారిని సరి చేసుకుంటూ పోతుంటారు. దీపికా పదుకొనె కి అయితే, ఆమె చెల్లెలు అనీషాయే మొదటి విమర్శకురాలు.

    అనీషా సినిమాల్లోకి రాలేదు. రావాలని కూడా ఆమెకు లేదు. తండ్రి ప్రకాశ్ పదుకొనె లాగా మంచి క్రీడాకారిణి కావడమే ఆమె లక్ష్యం. అందుకే అటువైపు అడుగులు వేసింది. అద్భుతమైన గోల్ఫ్ క్రీడాకారిణి అయ్యింది. టాప్ 9 ర్యాంకులో ఉంది. సినిమాల్లోకి రావా అంటే అసలా ఉద్దేశమే లేదు, అక్క ఉంది కదా చాలు అంటోందీ ఇరవై రెండేళ్ల చిన్నది.

    పేరుకు క్రీడాకారిణే అయినా, సినిమాలు విపరీతంగా చూస్తుందట అనీషా. తీరిక దొరికితే సినిమాలే ఆమెకు టైమ్ పాస్ అట. అక్కయ్య చాలా నచ్చుతుందట. కానీ ఏమాత్రం బాగోకపోయినా చీల్చి చెండాడేస్తాను అంటూ నవ్వేస్తోంది. అక్క నటించిన ప్రతి సినిమానీ ప్లస్సులూ మైనస్సులూ వివరించి చెప్పడం అనీషాకి అలవాటు.

    దీపిక కూడా చెల్లెలి అభిప్రాయానికి చాలా విలువిస్తుంది. ఆమె మంచి విమర్శకురాలు అని కితాబు కూడా ఇస్తుంది.  అయితే బాలీవుడ్ కలెక్షన్ల చరిత్రను తిరగరాసిన చెన్సై ఎక్స్ ప్రెస్ చిత్రం అనీషాకి ఏమాత్రం నచ్చలేదట. ఆ సినిమాని నేనసలు ఎంజాయ్ చేయలేకపోయాను, అది నా టైపు సినిమా కాదో ఏమో నాకు తెలియదు కానీ... ఆ సినిమా నాకసలు నచ్చలేదు అంటూ తేల్చి చెప్పేసింది అనీషా. ఈ విషయం అక్కకి కూడా చెప్పేసిందట.

    యే జవానీ హై దివానీ, ఓం శాంతి ఓం చిత్రాలు ఇష్టమట. లఫంగే ఫరిందేలో అయితే అద్భుతంగా నటించిందట. ఇలా అక్క గురించి అన్నిటినీ వివరించేసింది అనీషా. మొత్తానికి దీపికకి తెలివైన చెల్లెలే ఉందండోయ్!

    Tollywood

    Bollywood

    Kollywood