ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 18 November 2013

    టాలీవుడ్ లో సంచలనం సృస్టించిన యంగ్ హీరో

    టాలీవుడ్ లో సంచలనం సృస్టించిన యంగ్ హీరో
    సినిమాలకు క్లాప్ అసిస్టెంట్ గా పనిచేసి టాలీవుడ్ లో ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా హీరోగా నిలబడటం అంటే సామాన్య విషయం కాదు. చిన్న హీరోగా మొదలైన నాని కెరియర్ ‘ఈగ’ సినిమాతో టాప్ రేంజ్ కి చేరిపోయింది.

    ఆ తరువాత సినిమాల ఎంపికలో చిన్నచిన్న పొరపాట్లు చేయకుండా ఉండి ఉంటే ఈపాటికే నాని టాప్ హీరోల స్థాయికి ఎదిగిపోయి ఉండేవాడని టాలీవుడ్ విమర్శకులు అంటారు.  

    కానీ ఈగ తరువాత సరైన హిట్ లేకపోయినా నాని క్రేజ్ తగ్గలేదు అనడానికి మరో స్పష్టమైన ఉదాహరణ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. అయితే స్టార్ హీరోలకు పోటీ పడుతూ తన ఫేస్ బుక్ పది లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుని మరో కొత్త సంచలనం సృస్టించాడు మన ‘ఈగ’ హీరో.

    టాలీవుడ్ యంగ్ హీరోలకు సంబంధించి ఇలా పది లక్షల మంది ఫాలోవర్స్ పొందిన హీరోల లిస్టు లో ఈమధ్యనే అల్లుఅర్జున్ చేరాడు. ప్రస్తుతం నానీ కూడా అల్లుఅర్జున్ తో సమానం కావడం నానీ స్టామినాను తెలియచేస్తోంది.  

    నాని నటించిన ‘పైసా’ సినిమా పై బాగా అంచనాలు ఉన్నా ఆర్ధిక సమస్యలు మధ్య పైసా ఇరుక్కుపోవడంతో ‘పైసా’ బయటకు రావడం ఆలస్యం అవుతోంది. ఎదిఎమైనా నాని ప్రస్తుతం సాధించిన రికార్డు అతడికి మరింత జోష్ ఇస్తుందని అనుకోవాలి.

    Tollywood

    Bollywood

    Kollywood