ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Saturday, 30 November 2013

మహేష్ కి కోపం వచ్చింది !

మహేష్ కి కోపం వచ్చింది !
‘సంక్రాంతి కి ''నేనొక్కడినే దియేటర్లో కి వస్తుంది.’ చూసి ఎంజాయ్ చేయండి’. అని స్వయంగా మహేశ్ ప్రకటించారు. కాని ప్రోగ్రస్ చూస్తుంటే అనుకున్న సమయానికి రాదేమో ? అన్న సందేహం కలుగుతోంది. ఈ చిత్రం ఆఖరి పాట షూటింగ్ ఈవారం ముంబై జరగాల్సింది. కాని ఈ షెడ్యూల్ డిసెంబర్ 11 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంభందించి విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ ఇంకా జరుగుతూనే వుందట. దర్శకుడు సుకుమార్ పర్ఫెక్షన్.. పర్ఫెక్షన్ అని మరీ లేటు చేస్తున్నాడని టాక్.

మహేశ్ సుమారు రెండేళ్ళు గా ‘వన్’ కోసం పనిచేస్తున్న.. ఇప్పటికీ సినిమా పూర్తి కాకపోవడంతో యూనిట్ పట్ల మండిపడ్డాడని బోగట్టా. ఇక ఈ చిత్రం కోసం మహేశ్ చాల కష్టపడ్డాడు. బాడీ ఫిట్‌గా ఉంచుకునేందుకు పర్సనల్‌ ట్రెయినర్‌ని సొంత ఖర్చులతో పెట్టుకున్నాడు. ముఖ్యంగా ‘వన్’ లుక్ ని కాపాడుకోవటం కోసం చాల జాగ్రత్తలు తీసుకున్నాడు. తానెంత కష్టపడినా, ఎన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చినా ఇంకా ‘వన్’ పూర్తి కాకపోవడం తో టీం పట్ల ప్రిన్స్ అసహనంగా ఉన్నాడని టాక్. అయితే ఎలాగైనా మహేష్ చెప్పిన డేట్ కి ‘వన్’ ధియేటర్లోకి వచ్చేస్తుందని యూనిట్ కాన్పిడెంట్ గా వుంది.

Post Comments

No comments:

Post a Comment