బెంగుళూర్ భామ దీపికా పడుకొనే ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఈ అమ్మడు ఉంటే సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. సక్సెస్ లో ఉన్న దీపిక వెంట దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. సక్సెస్ ఉన్నప్పుడే కదా అందరూ వెంటపడేది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటోంది ఈ బాలీవుడ్ భామ. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన '' చెన్నై ఎక్ష్ ప్రెస్ '' చిత్రానికి నాలుగు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నది ఈ భామ. తాజాగా విడుదలై మంచి విజయం సాధిస్తున్న ''రామ్ -లీల'' తో దీపిక ఇమేజ్ మరింతగా పెరిగింది. రామ్ లీల కు భారీ గా ఓపెనింగ్స్ వచ్చాయంటే దానికి కారణం కేవలం దీపికానే అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు . దీంతో ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేసిందట! ఇక చేయబోయే సినిమాకు పది కోట్లు డిమాండ్ చేస్తోందట. వరుస విజయాలు సాధిస్తూ బాలీవుడ్ అగ్ర హీరో లతో సమానమైన ఇమేజ్ పొందింది కాబట్టి ఆ డిమాండ్ సహేతుకమైనదే నని అంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవడమంటే ఇదేనేమో దీపికా !సక్సెస్ లో ఉంది కాబట్టే వెంటపడుతున్నారు. లేకపోతే అంత మొత్తం ఎందుకు ఇస్తారు...!
Saturday, 23 November 2013
Tollywood