కాన్పూర్: వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెల్చుకుంది. బుధవారమిక్కడ జరిగిన చివరి వన్డేలో ధోని సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 264 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 46.1 ఓవర్లలో 266 పరుగులు చేసింది. మరో 23 బంతులు మిగులుండగానే ధోని సేన విజయాన్ని అందుకుంది.
ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతంగా సెంచరీ సాధించాడు. 95 బంతుల్లో 20 ఫోర్లతో 119 పరుగులు చేసి అవుటయ్యాడు. యువరాజ్ సింగ్(55) అర్థ సెంచరీతో రాణించాడు. రోహిత్ శర్మ(4) మరోసారి నిరాశపరిచాడు. కోహ్లి 19 పరుగులే చేశాడు. రైనా(34) ఫర్వాలేదనిపించాడు. ధోని(23) నాటౌట్ గా నిలిచారు. విండీస్ బౌలర్లలో రామ్ పాల్, బ్రేవొ రెండేసి వికెట్లు పడగొట్టారు. నరైన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
సెంచరీ హీరో శిఖర్ ధావన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లి 'మ్యన్ ఆఫ్ ద సిరిస్' అవార్డు అందుకున్నాడు. కొచ్చిలో జరిగిన మొదటి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో విండీస్ నెగ్గింది.

No comments:
Post a Comment