ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 27 November 2013

    లక్కీ చాన్స్ కొట్టేసిన ఇలియానా

    లక్కీ చాన్స్ కొట్టేసిన ఇలియానా
    ఇలియానా దశ తిరిగింది. తెలుగులో ఖాళీ అయిపోయిందనగానే బాలీవుడ్ లో పుంజుకుంది. తొలిచిత్రం 'బర్ఫీ' ఆమెకు మంచి పేరు తేవడంతో అక్కడ ఆమెకు ఆఫర్ల వెల్లువ వస్తోంది.  పైగా బాలీవుడ్ హీరోయిన్లలా మంచి ఫిగర్ వుండడం ఇల్లీ బ్యూటీకి అది పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది. తను నటించిన రెండో సినిమా 'ఫటా పోస్టర్ నికలా హీరో' ఇప్పటికే విడుదల కాగా, ప్రస్తుతం ఈ చిన్నది 'హ్యాపీ ఎండింగ్', 'మై తేరా హీరో' చిత్రాలలో నటిస్తోంది.

    ఇదిలా ఉంచితే, తాజాగా ఈ గోవా బ్యూటీకి సల్మాన్ ఖాన్ సరసన నటించే చాన్స్ దక్కినట్టు సమాచారం. సల్మాన్ హీరోగా సూరజ్ భర్జాత్యా రూపొందించే సినిమాలో ఇలియానాను తీసుకున్నారట. మొదట్లో కరీనాకపూర్ కోసం ప్రయత్నించారు. అయితే, డేట్స్ సమస్య వల్ల కుదరకపోవడంతో, ఆ అవకాశాన్ని ఇల్లీ తన్నుకుపోయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.

    No comments:

    Post a Comment

    Tollywood

    Bollywood

    Kollywood