ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 25 November 2013

    ఆరుషి తల్లిదండ్రులే హంతకులు: కోర్టు తీర్పు

    ఆరుషి తల్లిదండ్రులే హంతకులు
    న్యూఢిల్లీ: ఆరుషి, పని మనిషి  హేమ్‌రాజ్‌  హత్య కేసులో  ఆరుషి తల్లిదండ్రులు తల్వార్ దంపతులే దోషులని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే దోషులకు శిక్షలను కోర్టు రేపు ఖరారు చేస్తుంది. అయిదున్నరేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఆరుషి హత్య కేసులో ఎట్టకేలకు ఈ రోజు కోర్టు తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తుది తీర్పు వెలువడుతున్న ఈ నేపథ్యంలో ఘజియాబాద్ కోర్టు వద్ద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.   ఈ కేసుకు సంబంధించి 15 నెలల్లో 84 మంది సాక్షులను సీబీఐ విచారించింది. తల్లిదండ్రులు డాక్టర్ రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్ లే కూతురు ఆరుషి, తమ వద్ద పని చేసే హేమరాజ్ ను హత్య చేశారని ఛార్జీషీట్ లో పేర్కొన్నారు. ఆరుషిని చంపింది ఆమె తల్లిదండ్రులేనని  సీబీఐ కోర్టు నిర్ధారించింది. హత్యతో పాటు సాక్ష్యాధారాలు కూడా వారు తారుమారు చేశారంటూ కోర్టు తీర్పు చెప్పింది.

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో  ముందుగా అనుకున్నట్లే  ఆరుషి తల్లిదండ్రులు నూపుర్, రాజేష్ తల్వార్ లే   దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయు విహార్‌లోని తన నివాసంలో మే16, 2008న 14 ఏళ్ల ఆరుషి హత్యకు గురైంది.  నిందితుడిగా అనుమానించిన హేమ్‌రాజ్‌ కూడా ఆ తరువాత  అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తల్లిదండ్రలు ఉన్నారు. ఈ హత్య మిస్టరీగా మారడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.  ప్రారంభం నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజలు ఈ కేసు పట్ల ఆసక్తి చూపించారు.  

    జర్నలిస్టులను సాక్షులుగా పరిగణించాలన్న తల్వార్ విజ్ఞప్తిని  సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆరుషి హత్య కేసులో  సాక్షులను ప్రశ్నించాలన్న తల్వార్‌ దంపతుల విజ్ఞప్తి సుప్రీం కోర్టు  తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎడిజి(శాంతి భద్రతలు), సిబిఐ సంయుక్త సంచాలకులు అరుణ్‌ కుమార్‌లతో పాటు అదనంగా మరో 14 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు ముందుగా కొట్టివేసింది. దాంతో  వారు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. సుప్రీం కోర్టు వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. ఘజియాబాద్ కోర్టు నూపుర్, రాజేష్ తల్వార్ లనే హంతకులుగా తీర్పు చెప్పింది. అయితే కోర్టు రేపు శిక్ష ఖరారు చేస్తుంది.

    Tollywood

    Bollywood

    Kollywood