ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 25 November 2013

    మీడియాపై సమంతా ఫైర్...!

    మీడియాపై సమంతా ఫైర్...
    కల్పిత వార్తల్ని సృష్టిస్తూ తనపై అసత్యకథనాల్ని ప్రచారం చేస్తున్నారంటూ మీడియాపై మండిపడుతోంది టాలీవుడ్ గోల్డెన్ లెగ్ సమంతా. ఈ మధ్యకాలంలో ఏ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని, అయినా తన పేరున ఇంటర్వ్యూల్ని ప్రచురించారని వాపోయింది ఈ సుందరి. ఆమె మాట్లాడుతూ ‘కొన్ని పత్రికల్లో వచ్చిన నా ఇంటర్వ్యూల్ని చూసి షాకయ్యాను. వాటిలో పూర్తి అవాస్తవాల్ని రాశారు. నేను ఇంటర్వ్యూ ఇవ్వనప్పుడు నా గురించి ఎలా రాస్తారో అర్థం కావట్లేదని వాపోయింది.

    నేను శృతిహాసన్ సినిమాల ఫెయిల్యూర్స్‌ను ఎంజాయ్ చేస్తున్నానని ఓ వారపత్రికలో రాశారు. మరో పత్రికలో ‘తెలుగు పరిశ్రమలో అనుష్క నెంబర్‌వన్ నాయిక. ఆమె ఎంతో అంకితభావంతో కృషి చేసి ఉన్నత స్థాయికి వచ్చింది’ అని నేను చెప్పినట్లుగా రాశారు. నా సహచర నాయికల గురించి వారి అనుమతి లేకుండా నేనెప్పుడూ మాట్లాడను. కల్పిత కథనాలతో వార్తలు రాయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమాచారం వల్ల పాఠకులు అయోమయానికిగురయ్యే అవకాశముంది.

    నా సినిమాల గురించి, ఇంటర్వ్యూ విశేషాలు గురించి నేను ట్విట్టర్‌లో పేర్కొంటాను. ఆ వార్తల్ని మాత్రమే నమ్మండి’ అని చెప్పింది. ఈ సుందరి ప్రస్తుతం తెలుగులో ‘ఆటోనగర్ సూర్య’, ఎన్టీఆర్ ‘జోరు’, వి.వి.వినాయక్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. ఏది ఏమైనా సమంతా అలా ఫైర్ అయ్యే సరికి... సమంతా ఏమి తక్కువది కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు.

    Tollywood

    Bollywood

    Kollywood