ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 19 November 2013

    మంత్రి గారి అలసత్వం ... విద్యార్థినిపై అత్యాచారం

    మంత్రి గారి అలసత్వం ... విద్యార్థినిపై అత్యాచారం
    లక్నో: ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ సర్కారు విద్యార్థులకు అందిస్తున్న ఉచిత ల్యాప్ టాప్ ల పథకం.. ఓ విద్యార్థిని అత్యాచారానికి కారణమైంది. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిన మంత్రిగారు ఆలస్యంగా రావడంతో.. ల్యాప్ టాప్ అందుకుని తిరిగి వెళ్తున్న ఓ విద్యార్థిని దారుణ అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో చోటు చేసుకుంది. ఫైజాబాద్ లో సోమవారం మధ్యాహ్నం విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

    ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిన ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అవధేష్ ప్రసాద్ దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యంగా వచ్చారు. దాంతో రాత్రి 10.30కి ల్యాప్ టాప్ లను విద్యార్థులకు మంత్రి పంపిణీ చేశారు. ఆ బాలిక ల్యాప్ టాప్ తీసుకుని ఆటోలో తోటి విద్యార్థులతో పాటు స్వగ్రామమైన విశ్వంభరపట్ బయలుదేరింది. అందరినీ దించిన ఆటో డ్రైవర్ ఆమెను మాత్రం దించకుండా ఊరి చివర పొలాల్లోకి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం జరిపి, పరారయ్యాడు.

    దాంతో బాలిక తల్లితండ్రులకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. మంత్రి అవధేష్ ప్రసాద్ అంత ఆలస్యంగా రావడమే ఈ దారుణానికి కారణమని విశ్వంభర్ పట్ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood