ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 19 November 2013

    షర్మిలను కరివేపాకు అనుకున్నాడా?

    షర్మిలను కరివేపాకు అనుకున్నాడా
    వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఒంటెద్దుపోకడ మరీ మితిమీరిపోతుందా?  అన్న వదిలిన బాణంగా దూసుకొచ్చిన షర్మిలను కూడా కాదనుకుంటున్నాడా? బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని కాదు పొమ్మన్నాడా? తాను జైల్లో వున్నప్పుడు పార్టీని బతికించిన సొంత చెల్లెలు కూరలో కరివేపాకులా తీసేయాలని నిర్నయించుకున్నాడా?  అసలు జగన్ మనస్తత్వమే వాడుకొని వదిలేయడమేనా? ఇవే ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న ప్రశ్నలు.

    తాజాగా హైదరాబాదులో జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీలో ముఖ్యలయిన నాయకులందరూ పాల్గొన్నప్పటికీ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, సోదరి షర్మిల ఇద్దరు కూడా హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు నుండి, షర్మిల కడప నుండి లోక్ సభ టికెట్స్ ఆశించి భంగపడినందునే ఈ సమావేశానికి గైర్హాజరయ్యారని సమాచారం. అయితే ఇందులో నిజానిజాలెలా ఉన్నపటికీ వాస్తవ పరిస్థితిలు కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

    ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయిన నాటి నుండి షర్మిల పార్టీలోకి కానీ, ప్రజల మధ్యగానీ కనబడలేదనిధి వాస్తవం. ఇప్పుడు ముఖ్య పార్టీ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడం మరింత అనుమానాలకు తావిస్తుంది. ఏకంగా 3000 కిమీ పాదయాత్ర చేసి తాను తన సోదరుడు జగన్ తరపునే ప్రజల వద్దకు వచ్చానని చెప్పిన షర్మిలని గుర్తుచేసే జగన్మోహన్ రెడ్డి నోట పార్టీ కోసం, తన కోసం ఇంత కష్టపడిన షర్మిల సేవలను ప్రశంసిస్తూ నేటివరకు ఒక్క ముక్క కూడా వినబడలేదు.

    ఇలా ఎన్నెన్నో అనుమానాల మధ్య మొత్తం మీద షర్మిల జగన్ ను దూరమయ్యారని ప్రచారం నిజమేననిపిస్తుంది. ఇక సొంత సోదరినే కరివేపాకులా తీసేసిన వరుసకు బాబాయ్ అయిన సుబ్బారెడ్డిని పొమ్మనడం పెద్ద వింతేమీ కాదని చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్, సిన్సియర్ నేతలను  పార్టీకి దూరం చేసుకున్న జగన్ ఇప్పుడు వీళ్ళను కూడా దూరం చేసుకుంటే భవిష్యత్ లో జగన్ రెడ్డి ఒక్కడే ఉంటాడని పొలిటికల్ వర్గాలలో సెటైర్లు వినిపిస్తున్నాయి!

    Tollywood

    Bollywood

    Kollywood