ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 18 November 2013

    బ్రేకింగ్ న్యూస్: తెలంగాణకు అడ్డం తిరిగిన మహారాష్ట్ర

    తెలంగాణకు అడ్డం తిరిగిన మహారాష్ట్ర, No Telangana State, Andhrapradesh
    బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఏర్పాటుకు పొరుగురాష్ట్రం మహారాష్ట్ర అడ్డం తిరిగింది. అదికూడా ఒకప్పటి తెలంగాణతో కలిసి ఉన్న విధర్భ ప్రాంతం వారు. అదేంటి వారిది కూడా విభజన వాదమే కదా, వారు కూడా తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తున్నారు కదా అంటే అదీ నిజమే.

    ఎందుకంటే ఇప్పుడు కూడా వారు తెలంగాణ ఇవ్వొద్దు అనడం లేదు, కాని తెలంగాణాతో పాటే మాకు విధర్భ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమానికి దిగుతున్నారు. దీంతో ఇదేం తలనొప్పి అని కేంద్రం ఇప్పుడు తెలంగాణ ఏర్పాటును కూడా ఎక్కడ నిలిపివేస్తుందో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే మహారాష్ట్ర తెలంగాణాకు అడ్డు తగులుతోంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ నెల ఆరు నుంచి మహారాష్ట్ర పిసిపి అద్యక్షుడు రంజిత్ దేశ్ ముఖ్ కుమారుడు, విధర్భ జేఏసి కన్వీనర్ ఆశీష్ దేశ్ ముఖ్ ప్రత్యేక విధర్భ కోసం నిరసన దీక్షకు దిగుతున్నాడు. తెలంగాణతో పాటు విధర్భ డిమాండును కూడా అంగీకరించి ఇప్పుడే మహరాష్ట్రను కూడా విడగొట్టి విధర్భ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఈ ఆందోళను దిగుతున్నాడు ఆశీష్.

    ఇప్పుడు ఒత్తిడి తెస్తేనే కేంద్రం ఒప్పుకుంటుంది, ఇంత మంచి తరుణం మళ్లీ మనకు భవిష్యత్తులో ఇక రాదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు.

    మొదటి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ కమీషన్ చైర్మన్ ఫజల్ అలీ 1956 లో సూచించినట్టు మహారాష్ట్రను కూడా రెండు రాష్ట్రాల ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఈ నిరసన మొదలు పెడుతున్నారు.

    మరో వైపు గూర్ఖాలాండ్ సమస్యపై కూడా ఈ నెల 20న చర్చలు జరగనున్నాయి. అంటే తెలంగాణా ఏర్పాటు అంశం కేంద్రానికి తలనొప్పిగా మారే అవకాశాలు కాస్తా కనిపిస్తున్నాయి.

    మరో వైపు జగన్ ప్రయత్నం కూడా ఇతర రాష్ట్రాల్లో జరుగుతోంది. ఇది కూడా ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న విభజన వాదం పైకి లేపిందనుకో ఇక ఏపి విభజన ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood