ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 17 November 2013

    అనుష్కకి మూడొచ్చింది!

    Anushka Ready for Marriage, Anushka Comments on Marriage, Anushka Love Affair, Anushka Going to Marry soon
    కన్నడ కస్తూరి  అనుష్కకి పెళ్లి మూడొచ్చింది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంది, సరైనవ్యక్తి కోసమే వెయిటింగ్ అని  ప్రకటించింది.  ప్రేమ, పెళ్లి అంటూ మీడియా రాస్తున్న వార్తలు చూసి స్వతహాగా  అనుష్క కూడా టెంప్ట్  అయినట్టుంది. అందుకే పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకుంది. ఇదివరకు పెళ్లి గురించి అడగ్గానే.. పెళ్ళా అప్పుడేనా? అని గారాలు పోయేది. ఇప్పుడు మాత్రం అందుకు  పూర్తి భిన్నంగా స్పందించింది.

    ఆ విషయం గురించి అనుష్క మాట్లాడుతూ... ``నా పెళ్లి మీడియా ఎన్నిసార్లు చేసిందో లెక్కేలేదు. ఇక ఆ చాన్సు ఇవ్వను. ఎందుకంటే నాక్కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. సరైన వ్యక్తికోసమే వెయిటింగ్ చేస్తున్నా. ఎర్రగా, నా అంత హైటుగా, మంచి మనసున్న వ్యక్తి దొరగ్గానే పెళ్లి చేసేసుకుంటా. అయితే  నా పెళ్లి ఎప్పుడైనా ప్రేమించిన వాడితోనే జరుగుతుంది`` అని ప్రకటించేసింది. అనుష్క త్వరలో `వర్ణ` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క `రుద్రమదేవి`, `బాహుబలి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

    Tollywood

    Bollywood

    Kollywood