ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 22 November 2013

    విభజన జరగకపోతే... క్రెడిట్ ఎవరికి..!

    విభజన జరగకపోతే... క్రెడిట్ ఎవరికి..!
    ‘విభజన అయ్యేది ఖాయం. 'టీ' రాష్ర్టం సాకారమై తీరుతుంది, జనవరిలోనే రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు’ ఇవి తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు. వారిలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం. సోనియా గాంధీ ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గరు. సీమాంధ్ర వాసుల అభ్యంతరాలను అక్కడ ఎవరూ లెక్కచేసే పరిస్థితిలోలేరు అన్న ధీమా కూడా తెలంగాణ వాదుల్లో బలంగా వినిపిస్తోంది. మరోవైపు ‘విభజన జరిగే ప్రసేక్త లేదు. అసెంబ్లీ అభిప్రాయం వ్యతిరేకంగా వున్నప్పుడు ముందుకు వెళ్తే అది రాజ్యాంగ విరుద్ధమవుతుంది. దానికంటే ముందు ఆర్టికల్ 371డి రద్దుకు రాజ్యాంగ సవరణ అవసరం. యూపీయే సర్కారుకు రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో మెజార్టీ లేదు. గుడ్డిగా ముందుకు వెళ్తే న్యాయపరంగా పోరాటం చేసి అడ్డుకునేది ఖాయం’ ఇవి రాష్ర్ట విభజనను అడ్డుకోవాలని ఆకాంక్షిస్తున్న సీమాంధ్ర వాసులు, పాలక కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వాదనలు. భవిష్యత్తుపై వారిలో తొంగి చూస్తున్న ఆశలు.

    తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీల నేతల్లో టిపై కొండంత ఆశ కనిపిస్తుండగా... అదే స్థాయిలో సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతల్లో విభజన జరగదనే అంశంలో విశ్వాసం తొంగిచూస్తోంది. ఈ క్రమంలో ఏదేని న్యాయపరమైన అవాంతరాలు ఎదురై ప్రక్రియ ఆగిపోతే... సీమాంధ్ర ప్రాంతంలో ఘనత ఎవరికి దక్కుతుంది, ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తారు, అధికార పార్టీలో వున్నప్పటికీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ న్యాయపరమైన చిక్కుముడులను జనం ముందుకు తీసుకు వెళ్ళిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు ఆ ఘనత దక్కుతుందా... లేక సమ న్యాయం పేరుతో సీమాంధ్ర వాసుల అభ్యంతరాలను నివృత్తి చేశాకే ముందడుగు వేయాలన్న తెలుగుదేశం పార్టీకా... విభజన నిర్ణయం వెలు వడిన వెంటనే సమైక్యవాదం భుజానికెత్తుకున్న వైకాపాకా అన్న ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

    విభజన ఏదేని అనుకోని పరిస్థితిల్లో ఆగిపోతే, సమైక్యంలో ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే బలహీన పడిన వైకాపా, సమన్యాయంతో తెలంగాణపై యూటర్న్ తీసుకున్నట్టుగా విమర్శలు ఎదుర్కొంటున్న టిడిపికి కూడా ఇబ్బందికర పరిస్థితి తప్పదని అంచనాలొస్తున్నాయి. సమైక్యం కోసం తామంటే తాము పోటాపోటీగా పనిచేశామని ప్రజల ముందుకు కాంగ్రెస్, టిడిపి, వైసీపీలు వెళ్ళే అవకాశం వుంటుంది. తమవల్లే విభజన ఆగిపోయిందని ఈ మూడు పార్టీలు ఎవరికి వారు క్లైమ్ చేసుకునే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్‌లో అందరికంటే ఎక్కువగా సీయం కిరణ్ క్రెడిట్ పొందే అవకాశం వుంటుంది.

    విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో టిడిపి, వైకాపాలు కూడా ఉద్యమాలు చేపట్టాయి. పోటాపోటీగా బస్సుయాత్రలు, నిరవధిక దీక్షలు చేశాయి. జాతీయ నాయకులను కలిసి ఒకరు సమన్యాయం, మరొకరు సమైక్యం కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాయి. ఈ పరిస్థితుల్లో విభజన ఆగిపోతే తమేక ఘనత దక్కుతుందని ఆయా పార్టీల నేతలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood