నవ్వుల పూబోణి నటి స్నేహతో నటుడు ప్రసన్న ప్రేమ వివాహం గురించి తెలిసిందే. పెళ్లి తర్వాత నటి స్నేహ చిత్రాలు తగ్గించుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్న స్నేహ గర్భం దాల్చిందని దీంతో తండ్రి హోదా రాబోతున్నందుకు ప్రసన్న ఆనందంలో మునిగి తేలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త చెవిన పడిన స్నేహ అదంతా అసత్య ప్రచారమని కొట్టి పారేశారు. తానింకా గర్భం దాల్చలేదని, అలాంటి శుభవార్త ఏమైనా ఉంటే ముందుగా పత్రికల వారికే చెబుతానని పేర్కొన్నారు. నటుడు ప్రసన్న కూడా ఈ విషయాన్ని ధ్రువపరుస్తూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. స్నేహ చిత్రాలను తగ్గించుకున్న మాట నిజమే గానీ, తామిప్పుడే పిల్లలు కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్నేహ నటుడు ప్రకాష్‌రాజ్ నిర్మిస్తూ నటిస్తున్న ఉన్ సమయిల్ చిత్రంలో నటిస్తున్నారు.
Monday, 25 November 2013
Tollywood