ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 25 November 2013

    'బాహుబలి'లో భారీ వార్...?

    'బాహుబలి'లో భారీ వార్...
    రాజమౌళి భారీ ఎత్తున తీస్తున్న బాహుబలి లో భారీ సీన్ లున్నాయట. ఒక సినిమాని భారీగా తీస్తున్నప్పుడు అందులో వార్ ఎపిసోడ్స్ కూడా భారీగానే వుండాలి కదా? అందుకే, రాజమౌళి తన 'బాహుబలి' సినిమాలో యుద్ధ సన్నివేశాలను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడట. ఈ వార్ ఎపిసోడ్ లో 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారనీ, వీరందరికీ గుర్రపు స్వారీ, ఖడ్గ యుద్ధంలో ట్రైనింగ్ ఇస్తున్నారనీ టాలీవుడ్ వర్గాల టాక్.

    ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హేన్స్ నేతృత్వంలో చిత్రీకరించే ఈ యుద్ధ సన్నివేశాలు మహాభారత కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తాయని అంటున్నారు. డిసెంబర్ నుంచి రెండు నెలల పాటు కేవలం ఈ యుద్ధ సన్నివేశాలనే చిత్రీకరిస్తారని చెబుతున్నారు. అయితే రాజమౌళి కి నిద్ర పట్టని అంశం ఏంటంటే తను ఎంత జాగ్రతగా ఉన్న సినిమాలోని పాత్రలు బయటకు వెళ్ళడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట.

    నిన్న కాక మొన్న ప్రభాస్ గెటప్ ఫోటో రిలీజ్ అయ్యిందని వెబ్ మీడియా కోడై కూసింది. ఇలా సంనివేస్సాలు బయటకు వస్తుంటే సినిమా రిలీజ్ కు ముందే హైప్ క్రియేట్ చేద్దామన్న అసలు ఎక్కడ అవిరైపోతాయో అని భాధ పడటం తప్ప ఏం చేయగలం చెప్పండి.  కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని ఫారెస్ట్ ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రభాస్, రానా, అనుష్క ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood