ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 19 November 2013

    అఖిల్ ఎంట్రీకి కార‌ణం ఇదే...

    అఖిల్ ఎంట్రీకి కార‌ణం ఇదే
    మ‌నంలో అఖిల్ కూడా ఉన్నాడోచ్‌.. అంటూ మీడియా తెగ ఊద‌ర‌గొట్టేస్తోంది. అక్కినేని ఫ్యామిలీ సినిమా క‌దా..?  అఖిల్ ఉండడంలో ఆశ్చ‌ర్యం ఏమీ లేదు. కాక‌పోతే నాగార్జున మాట‌లు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మీ సినిమాలో అఖిల్ ఉన్నాడా??  అని అడిగితే.. ''అఖిల్ కి ఈ సినిమాలో పాత్ర లేదు. అఖిల్ కోసం స‌న్నివేశాల‌ను ఇరికించ‌లేం..'' అన్నారాయ‌న‌. కానీ.. స‌డ‌న్‌గా ఈ సినిమాలో అఖిల్ పేరు తెర‌పై కొచ్చింది. ప‌తాక స‌న్నివేశాల్లో అఖిల్ క‌నిపిస్తాడ‌ని, ఆయ‌నది కేవలం సెక‌న్ల న‌డివి ఉన్న పాత్ర అని తెలిసింది. సోమ‌వారం ఈ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించార‌ట‌.

    ''మూడు త‌రాలు క‌ల‌సే సంద‌ర్భం ఎప్పుడోగానీ రాదు. ఒక వేళ అఖిల్ ఈ సినిమాలో క‌నిపించ‌క‌పోతే... ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఫ్యాన్ప్‌కి కూడా ఉంటుంది. భ‌విష్య‌త్తులో నాగేశ్వ‌ర‌రావుతో అఖిల్ తెర పంచుకొంటాడా?  లేదా?  అనేది అనుమాన‌మే. ఆ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకొనే అఖిల్ ని హఠాత్తుగా రంగంలోకి దింపారు..'' అని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ మాట కూడా క‌రక్టే. తెర‌పై న‌లుగురు అక్కినేని హీరోలు క‌నిపిస్తే ఆ సంద‌డే వేరు. ఇంకా సుమంత్‌, సుశాంత్ బాకీ ఉన్నారు. వారినీ ఏదో ఓ ఫ్రేమ్‌లో చూపించేస్తే... తెర ప‌రిపూర్ణం అవుతుంది. ఏమంటారూ..?

    Tollywood

    Bollywood

    Kollywood