ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 20 November 2013

    గవర్నర్ నోట 'ఆరడుగుల బుల్లెట్'

    గవర్నర్ నోట ఆరడుగుల బుల్లెట్,Pawan Kalyan, Aradugula Bullet, ESL Narsimhan, Attarinitiki daaredi, పవన్ కళ్యాణ్, ఆరడుగుల బుల్లెట్, ఈఎస్ఎల్ నరసింహన్, అత్తారింటికి దారేది
    18వ అంతర్జాతీయ బాలల చలన చిత్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా 'ఆరడుగుల బుల్లెట్' అంటూ పవన్ కళ్యాణ్ గురించి గవర్నర్ నరసింహన్ అనడం వేదికపైనే కాక పెద్దల నుంచే కాకుండా, పిల్లల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తనకు వచ్చిరాని తెలుగులో అత్తారింటికి దారేది చిత్రంలోని పాటలోని కొన్ని లైన్లను చదువుతూ గవర్నర్ అందర్ని ఆకట్టుకున్నారు. ఆరడుగుల బుల్లెట్.. ధైర్యం విసిరిన రాకెట్.. గవర్నర్ అంటున్నపుడు పవన్ కళ్యాణ్ సిగ్గు పడుతూ, ముసి ముసి నవ్వులు నవ్వారు.

    అత్తారింటికి దారేది ద్వారా పవన్ కళ్యాణ్ పవర్ చూపించారు.. అయితే ఇంట్లో పవన్ కళ్యాణ్ లా మాత్రమే ఉండాలని గవర్నర్ సూచించారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ముగింపు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

    18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు హైదరాబాద్ శాశ్వత వేదికగా మారడం ఆనందంగా ఉంది. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లోని లలిత కళాతోరణం లో జరిగిన ముగింపు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరై ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

    Tollywood

    Bollywood

    Kollywood