ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Friday, 6 December 2013

సంజయ్ దత్ కు నెల రోజుల పెరోల్ మంజూరు

సంజయ్ దత్ కు నెల రోజుల పెరోల్ మంజూరు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు 30 రోజుల పెరోల్ ను ఎర్రవాడ జైలు అధికారులు మంజూరు చేశారు. దాంతో పూణేలోని ఎర్రవాడ జైలు నుంచి మరోసారి పెరోల్ పై సంజయ్ దత్ విడుదల కానున్నారు. తన భార్య మాన్యత అనారోగ్యంతో బాధపడుతుందని సంజయ్ దత్ చేసిన పెరోల్ పిటిషన్ జైలు అధికారులు పరిశీలించారు.

ఆ తర్వాత సంజయ్ కు పూణే డివిజినల్ కమిషనర్ పెరోల్ ను మంజూరు చేశారు. వైద్యం నిమిత్తం అక్టోబర్ ఒకటవ తేదిన సంజయ్  రెండు వారాల పెరోల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆతర్వాత ఆ పెరోల్ ను మరో రెండు వారాలు పొడిగించారు. దాంతో సంజయ్ అక్టోబర్ 30 తేదిన తిరిగి జైలుకు చేరుకున్నారు.

తాను కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాను. అయితే మునపటి కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. త్వరలో బయటకు రావాలని దేవుడ్ని ప్రార్ధించండి అని అక్టోబర్ 30 తేదిన సంజయ్ అన్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు 42 నెలల జైలుశిక్షను కోర్టు ఖారారు చేసిన సంగతి తెలిసిందే.

Post Comments

No comments:

Post a Comment