ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Friday, 6 December 2013

రాష్ట్రపతి భవన్ కు చేరిన తెలంగాణ బిల్లు

రాష్ట్రపతి భవన్ కు చేరిన తెలంగాణ బిల్లు
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దీన్ని ఎల్లుండి(ఆదివారం) పరిశీలించే అవకాశముంది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రపతి పరిశీలించిన తర్వాత బిల్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చేరుతుంది.

అసెంబ్లీ నుంచి బిల్లు వచ్చిన తర్వాత తిరిగి కేంద్ర కేబినెట్‌లో చర్చించి తుది బిల్లును ఖరారు చేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే నిన్న తెలిపారు.బిల్లు విషయంలో అసెంబ్లీకి రాష్ట్రపతి ఎంత సమయం ఇస్తారనేది తనకు తెలియదని.. అయితే ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది.

Post Comments

No comments:

Post a Comment