కిరణ్ పార్టీ ఖాయమైందా? సీమాంధ్రలో బిజెపితో పొత్తు పెట్టుకుంటారా? రాష్ట్ర విభజన విషయంలో హైకమాండ్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చివరిదాకా వారికి అంతు చిక్కకుండా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్య రాష్ట్ర నినాదంతో కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా ఆయన పావులు కదుపుతున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. పొత్తు విషయంలో కిరణ్ కంటే బిజెపి నాయకులే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. ఇందుకోసం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ గత నెలరోజుల్లో రెండు సార్లు రహస్యంగా హైదరాబాద్ వచ్చివెళ్ళారు. మొదటి సారి వచ్చినప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులతో సమావేశమైన పరిక్కర్ ఈ సారి కూడా ఇద్దరు నాయకులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఇప్పుడున్న 42 పార్లమెంట్ స్థానాలలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా 2014 తరువాత కేంద్రంలో అధికారంలోకి రావాలని బిజెపి ఆశిస్తోంది. గతంలో సీమాంధ్రలో కొన్ని పార్లమెంట్ స్థానాలకు ప్రాతినిథ్యం వహించిన బిజెపి ఈ సారి తమ బలాన్ని పెంచుకోవాలని ఆశిస్తోంది. సీమాంధ్రలోని కొన్ని పట్టణ ప్రాంతాలలో బిజెపికి బలం ఉంది. దాన్ని స్థిరీకరించుకోవడం ద్వారా కొన్ని సీట్లు గెలవాలని బిజెపి ఆశిస్తోంది. ఇందుకోసం ఒంటరిగా పోటీ చేయడానికి బదులు ఏదైనా ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకోవడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది.
ఇటీవలి సర్వే ఫలితాలు కూడా పరిస్థితి బిజెపి,ఎన్డీఎలకు అనుకూలంగా ఉందని సూచిస్తున్నందున పార్టీని బలోపేతం చేసుకోవడానికి బిజెపి అగ్ర నాయకత్వం అన్ని ప్రయత్నాలు మొదలెట్టింది. పరిక్కర్ హైదరాబాద్ పర్యటనకు బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ప్రధానమంత్రి అభ్యర్థి రాజ్‌నాథ్ సింగ్ సమ్మతి కూడా ఉంది. పరిక్కర్ పర్యటన గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి మినహా మరే ఇతర నాయకునికి చెప్పక పోవడం గమనార్హం. మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటులో భాగంగా కిరణ్ త్వరలో సీమాంధ్రలోని అన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమవ్వాలని భావిస్తున్నారు. తద్వారా అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చినప్పుడు ఏ మేరకు ఎదుర్కోగలమని అంచనా వేయడం కూడా ఈ సమావేశం ఉద్దేశం అని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకోవాలని కిరణ్ అనుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు. నాటకీయ పరిణామాల మధ్య పార్టీ ఆవిర్భావం జరిగితే ప్రచారం బాగా వస్తుందని ఆయన భావిస్తున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్తూ అందుకు నిరసనగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో పార్టీకి అండదండల కోసం బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు.

No comments:
Post a Comment