లక్ష్మి, తులసి ఈ సినిమాలతో ఆకట్టుకొన్న జంట వెంకటేష్, నయనతార. ఈ ఇద్దరూ రాధ సినిమాతో మరోసారి జత కడుతున్నారని చెప్పుకొన్నారు. రాధతో హ్యాట్రిక్ కొడుతున్నారనే ప్రచారం జరిగింది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించనున్నారు.
జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా నుంచి నయనతార తప్పుకొన్నట్టు సమాచారమ్. తనకున్న బిజీ షెడ్యూలు వల్ల ఈ సినిమా చేయలేకపోతున్నా.. అని నయనతార చెప్పిందట. దాంతో కొత్త కథానాయిక కోసం అన్వేషణ మొదలుపెట్టారు. జనవరి 14న లాంఛనంగా ఈ సినిమాని ప్రారంభిస్తారు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. మరి వెంకీతో ఆడిపాడే కథానాయిక ఎవరో త్వరలో తెలుస్తుంది.

No comments:
Post a Comment