కృష్ణ అల్లుడు సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ఆడు మగాడ్రా బుజ్జీ. అస్మితాసూద్, పూనమ్ కౌర్ కథానాయికలు. గంగదాసు కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 5న విడుదల చేయాలనుకొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల డేటు మారింది.
రెండు రోజులు ఆలస్యంగా అంటే... డిసెంబరు 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగిశాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. శ్రీ సంగీతం అందించారు. ప్రచార చిత్రాలూ, పాటలూ, అందులో సుధీర్ వేసిన స్టెప్పులూ అందరినీ ఆకట్టుకొంటున్నాయి. ఈ సినిమాపై అంచనాలనూ పెంచుతున్నాయి. ప్రేమ కథా చిత్రమ్‌తో తొలి విజయం రుచి చూసిన సుధీర్ బాబు ఆ విజయపరంపర కొనసాగిస్తారేమో చూడాలి.

No comments:
Post a Comment