నారా రోహిత్ జోరు పెంచాడు. అతని చేతిలో దాదాపు అయిదు సినిమాలున్నాయి. ప్రతినిధి విడుదలకు సిద్ధమైంది. శంకర పూర్తయింది. మద్రాసి సెట్స్‌పై ఉంది. గీత రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం కూడా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. ఇందులో విశాఖ సింగ్ కథానాయిగా నటిస్తోంది.
ఈ చిత్రానికి రౌడీ ఫెలో అనే టైటిల్ ఖరారు చేశారు. సినిమా 5 – మూవీ మిల్స్ బ్యానర్స్ వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సన్నీ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకూ 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2014 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రోహిత్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, అతనిలోని పూర్తిస్థాయి మాస్ కోణాన్ని ఈ సినిమాతో ఎలివేట్ చేస్తున్నామని చిత్రబృందం చెబుతోంది.

No comments:
Post a Comment