హైదరాబాద్: చంపాపేటలోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాల భవనంపై ఏర్పాటు చేసిన సెల్ టవర్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన సెల్‌టవర్‌లోని జనరేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కళాశాలలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
No comments:
Post a Comment